పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : విదేహ హర్షభ సంభాషణ

  •  
  •  
  •  

11-40-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రీతి గడప నేర్తురు?
క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్‌
నీసులు నరులు గావున
నాయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే?

టీకా:

ఏ = ఏ; రీతిన్ = విధముగ; గడపన్ = దాట; నేర్తురు = గలరు; క్రూరులు = క్రూరస్వభావులు; బహు = అనేకవిధములైన; దుఃఖ = దుఃఖములనెడి; రోగ = జబ్బులతో; కుత్సిత = అల్ప; బుద్ధుల్ = బుద్ధిగలవారు; నీరసులు = శక్తిహీనులు; నరులు = మానవులు; కావునన్ = కనుక; ఆరయ = తరచిచూసి; సుఙ్ఞాన = మంచి ఙ్ఞానముగల; బుద్ధిన్ = బుద్ధితో; ఆనతియీరే = చెప్పండి.

భావము:

క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి.