పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : విదేహ హర్షభ సంభాషణ

  •  
  •  
  •  

11-38-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ఘ్యపాద్యాదివిధులను ర్థితోడఁ
బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల
నుచితపీఠంబులందును నునిచి, యెలమి
వమునిశ్రేష్ఠులను భూమినాయకుండు.

టీకా:

అర్ఘ్య = అర్ఘ్యము ఇచ్చుట; పాద్య = పాద్యము ఇచ్చుట; ఆది = మున్నగు; విధులన్ = కృత్యములచేత; పూజ = సేవించుటలు; కావించి = చేసి; వారలన్ = వారిని; పొలుపు = ఒప్పుదనము; మిగులన్ = అతిశయించగా; ఉచిత = తగిన; పీఠంబులు = ఆసనములు; అందున్ = లోను; ఉనిచి = ఉంచి; ఎలమిన్ = వికాసముతో; నవ = తొమ్మిది మంది (9); ముని = ఋషులలో; శ్రేష్ఠులను = గొప్పవారిని; భూమినాయకుండు = రాజు.

భావము:

అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు.