పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : విదేహ హర్షభ సంభాషణ

  •  
  •  
  •  

11-37-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హింపఁ బుణ్యుఁ డైన వి
దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో
గేము వెడలి యెదుర్కొని
మోవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్‌.

టీకా:

ఊహింపన్ = తరచిచూసిన; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఐన = అయిన; విదేహుని = విదేహుడి; యజ్ఞ = యాగము; అంతము = చివర; అందున్ = లో; ఏతెంచినచో = రాగా; గేహము = ఇంటి; వెడలి = బయటకు వచ్చి; ఎదుర్కొని = ఎదురువచ్చి; మోహ = మోహజాలమునుండి; వివర్జితులన్ = బయటపడ్డవారిని; పుణ్య = పుణ్యవంతులను; ముని = ఋషుల; సంఘములన్ = సమూహములను.

భావము:

భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి....