పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వసుదేవ ప్రశ్నంబు

  •  
  •  
  •  

11-32-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అతిపాపకర్ములైనను
తము నారాయణాఖ్యబ్దము మదిలో
వితంబుగఁ బఠియించిన
తురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

టీకా:

అతి = మిక్కిలి; పాప = పాపపు; కర్ములు = పనులు చేయువారు; ఐనను = అయినప్పటికి; సతతము = ఎల్లప్పుడు; నారాయణ = నారాయణ; ఆఖ్య = అనెడి; శబ్దమున్ = నామమును; మది = మనస్సు; లోన్ = అందు; వితతంబుగన్ = ఎడతెగకుండ; పఠియించిన = స్మరించెడి; చతురులన్ = తెలివికలవారిని; కొనియాడన్ = స్తుతించుటకు; కమలసంభవు = బ్రహ్మదేవునికి; వశమే = శక్యమా, కాదు.

భావము:

ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు.