పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వసుదేవ ప్రశ్నంబు

  •  
  •  
  •  

11-31-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నను నీవు సేయు ప్రశ్నము
సన్నుత! వేదశాస్త్రసారాంశంబై
మగు హరిగుణకథనము
విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్‌.

టీకా:

ననున్ = నన్ను; నీవు = నీవు; చేయు = వేసెడి; ప్రశ్నము = ప్రశ్న; జన = లోకులచే; సన్నుత = కీర్తింపబడువాడ; వేద = వేదములు; శాస్త్ర = శాస్త్రముల; సారాంశంబు = ముఖ్య సారము; ఐ = అయ్యి; ఘనము = గొప్పది; అగు = ఐనట్టి; హరి = విష్ణుమూర్తి; గుణ = గుణముల; కథనము = వృత్తాంతము; వినుము = వినుము; అని = అని; వినిపింపన్ = చెప్ప; తొడంగె = మొదలిడెను; వేడ్కన్ = వేడుక; తలిర్పన్ = చిగురించుచుండగా.

భావము:

“సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది.” అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు.