పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వసుదేవ ప్రశ్నంబు

  •  
  •  
  •  

11-29-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము నృపాలక! సెప్పెద
మై విలసిల్లు పూర్వథ గల దదియున్‌
మును ద్వారక కేతెంచియు
నొరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌.

టీకా:

వినుము = వినుము; నృపాలక = రాజా; చెప్పెదన్ = తెలియజెప్పెదను; ఘనము = గొప్పది; ఐ = అయ్యి; విలసిల్లు = ప్రసిద్ధమైన; పూర్వకథ = పాతగాథ; కలదు = ఉన్నది; అదియున్ = దానిని; మును = పూర్వము; ద్వారక = ద్వారకానగరమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; ఒనరగన్ = చక్కగ; నారదుడు = నారదుడు; కృష్ణున్ = శ్రీకృష్ణుని; ఒయ్యనన్ = చక్కగా; కాంచెన్ = సందర్శించెను.

భావము:

“ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు.