పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-24-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మది సెడి కన్నులుగానక
యుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
దిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?

టీకా:

మది = బుద్ధి; చెడి = నశించి; కన్నులు = కళ్ళు; కానక = కనబడక; మద = గర్వము, పొగరు; యుతులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; మునులన్ = ఋషులతో; కల్ల = అబద్దపు; మాటలు = మాటలుతో; చెనయన్ = ఎదుర్కొనుటకు; కదిసి = చేరి; కుల = వంశమునకు; క్షయ = నాశన; కారణ = కారణభూతము; విదితంబు = కలిగించెడిది; అగు = అయ్యడి; శాపమున్ = శాపమును; ఒందు = పొందెడి; వెఱ్ఱులు = వెఱ్ఱివారు; కలరే = ఎక్కడైనా ఉంటారా.

భావము:

“మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి.