పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-17-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కారు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "

టీకా:

శ్రీనాయక = కృష్ణా {శ్రీనాయకుడు - శ్రీ (లక్ష్మీదేవికి, సంపదలకు) నాయకుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; నామము = పేరు; నానా = అనేకమైన; భవ = జన్మలు అనెడి; రోగ = జబ్బులను; కర్మ = కర్మలను; నాశమున్ = నశింపజేయుట; కున్ = కు; విన్నాణంబు = మిక్కిలినాణ్యమైనది; అగు = ఐన; ఔషధము = మందు; ఇది = ఇది; కానరు = తెలుసుకొనలేకున్నారు; దుష్టాత్ములు = దుష్టులు; అకట = అయ్యో; కంజదళాక్షా = కృష్ణా {కంజదళాక్షుడు - కంజ (పద్మముల) దళ (రేకుల వంటి) అక్ష (కన్నులు కలవాడు), కృష్ణు}.

భావము:

పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”