పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-12.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ,
గోటిమన్మథలావణ్యకోమలాంగు,
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ,
నిరి కరుణాసముద్రుని నులు మునులు.

టీకా:

ఘనుని = గొప్పవానిని; శ్రీ = మహనీయమైన; కృష్ణునిన్ = కృష్ణుడుని; కౌస్తుభ = కౌస్తుభమణిని; ఆభరణునిన్ = ధరించినవానిని; కర్ణకుండల = చెవికమ్మల; యుగ్మ = జత(తోప్రకాశించెడి); ఘన = గొప్ప; కపోలున్ = చెంపలుగలవానిని; పుండరీకాక్షున్ = పద్మనయనుని; అంభోధర = మేఘమువలె; శ్యామునిన్ = నల్లనివానిని; కలిత = ధరించిన; నానా = అనేక; రత్న = మణులు పొదిగిన; ఘన = గొప్ప; కిరీటున్ = కిరీటము కలవానిని; ఆజానుబాహు = మంచిపొడగరిని {ఆజానుబాహువు - ఆజాను (మోకాళ్ళ వరకు కల) బాహువు (చేతులు కలవాడు), సుందరుడు}; నిరర్గళ = ఆడ్డులేని; ఆయుధ = ఆయుధములను; హస్తున్ = ధరించినవానిని; శ్రీకర = శుభకరమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టుబట్టలు; వాసున్ = కట్టుకొన్నవానిని; రుక్మిణీ = రుక్మిణీదేవి యొక్క; నయన = కన్నులను; సరోజ = పద్మములకు {సరోజము - సరస్సున పుట్టినది, పద్మము}; దివాకరున్ = సూర్యుని వంటివానిని {దివాకరుడు - పగటికి కారణమైనవాడు, సూర్యుడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; సుర = దేవతలచే; సేవ్య = కొలవబడుతున్న; పాద = పాదములు అను; పద్మున్ = పద్మములు కలవాడు.
దుష్ట = చెడ్డవారిని; నిగ్రహ = శిక్షించుట; శిష్ట = మంచివారిని; సంతోష = సంతోషము; కరణున్ = కలిగించువాడు; కోటి = కోటిమంది; మన్మథ = మన్మథులతో తులతూగు; లావణ్యున్ = లావణ్యము కలవానిని; కోమల = మృదువైన; అంగు = శరీరము కలవానిని; ఆర్త = ఆర్తులైన; జన = వారిని; రక్షణ = కాపాడుటలో; ఏక = ముఖ్యమైన; విఖ్యాత = ప్రసిద్ధమైన; చరితున్ = ప్రవర్తన కలవానిని; కనిరి = చూసిరి; కరుణా = దయకు; సముద్రునిన్ = సముద్రమువంటివానిని; ఘనులు = గొప్పవారు; మునులు = ఋషులు.

భావము:

మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు.