పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : యాదవుల హతంబు

  •  
  •  
  •  

11-9-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరిపాదకమల సేవా
రులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫుణంబు సంభవించెనొ
యఁగ సంయమివరేణ్య! యానతి యీవే! "

టీకా:

హరి = కృష్ణుని; పాద = పాదములనెడి; కమల = పద్మముల; సేవాపరులు = కొలుచువారు; అగు = ఐన; యాదవులు = యాదవులు; కిన్ = కి; ఎట్లు = ఎలా; బ్రాహ్మణ = విప్రుల; శాప = శాపము; స్పురణంబున్ = తగులుట, ఉదయించుట; సంభవించెనో = కలిగినదొ; అరయగన్ = వివరముగ; సంయమి = మునులలో {సంయమి - సంయమనము కలవాడు, ఋషి}; వరేణ్య = మిక్కిలి ఉత్తముడా; ఆనతి యీవే = తెలుపుము.

భావము:

“మహానుభావ! మహాయోగీశ్వర! శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో తెలపండి.”