పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : భూభారంబు వాపుట

  •  
  •  
  •  

11-3-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
నన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.

టీకా:

బలవత్ = బలవంతమైన; సైన్యము = సేనలసమూహము; తోడన్ = తోటి; కృష్టుడు = శ్రీకృష్ణుడు; మహా = గొప్ప; బాహాబల = భుజబలము; ఉపేతుడు = కలవాడు; ఐన = అయ్యి; కలనన్ = యుద్ధరంగములో; రాక్షస = రాక్షసులైన; వీర = వీరులలో; వర్యులన్ = ఉత్తములను; వడిన్ = వేగంగా; ఖండించి = సంహరించి; భూ = భూలోకమునకు; భారమున్ = బరువుచేటు; ఉజ్జ్వలము = విజృంభించినది; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండుటచేత; ద్యూత = జూద; కేళి = క్రీడ; కతనన్ = కారణంగా; చావంగన్ = మరణించునట్లుగా; కౌరవ్య = కౌరవులయొక్క; సద్బలమున్ = సైన్యాలను; పాండవ = పాండవుల యొక్క; సైన్యమున్ = సైన్యాలను; అడచెన్ = అణచివేసెను; భూభాగంబు = భూమండలము; కంపింపగన్ = అదిరిపోయేలా.

భావము:

“శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు.