పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-95-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రధన పరదార రదూషణాదులఁ-
రవస్తుచింతదాఁ రిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
నువు చంచలతను గులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
క్తియుక్తుల మది న్నగిల్లక మున్న-
క్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు

11-95.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దైత్యభంజను దివ్యపాదారవింద
జన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
వ్యయానందమును బొందు నుదినంబు
తఁడు కర్మవిముక్తుఁడౌ నఘచరిత!

టీకా:

పర = ఇతరుల; ధన = ధనమును కోరుట; పర = ఇతరుల; దార = భార్యను కోరుట; పర = ఇతరులను; దూషణ = నిందించుట; ఆదులన్ = మున్ననవానిని; పర = ఇతరుల; వస్తు = వస్తువులందు; చింతన్ = అపహరించ ఆలోచన; తాన్ = తను; పరిహరించి = వదలివేసి; ముదిమి = ముసలితనము; చేన్ = చేత; రోగములు = జబ్బులు; ఉదయింపకట = పుట్టక; మున్న = ముందే; తనువున్ = శరీరమున; చంచలతనున్ = వణుకుట; తగులకుండ = కలుగముందే; బుద్ధి = మనస్సు; సంచలతన్ = చెదరుట; చేన్ = చేత; పొదలక = పెరిగిపోవుటకు; అట = అంతకు; మున్న = ముందే; శ్లేష్మంబు = కఫము; గళమునన్ = గొంతులో; చేరకుండ = చేరకముందే; శక్తి = బలము; యుక్తుల = సామర్థ్యములందు; మది = బుద్ధి; సన్నగిలక = క్షీణించక; మున్న = ముందే; భక్తి = భక్తితోకూడిన; భావన = ఆలోచనల; చేతన్ = వలన; ప్రౌఢుడు = నైపుణ్యముకలవాడు; అగుచున్ = ఔతు.
దైత్యభంజనున్ = నారాయణుని {దైత్యభంజనుడు - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; భజన = పూజించుట; నిజ = తన; భక్తి = భక్తిభావనలందు; ప్రాఙ్ఞుడు = యుక్తాయుక్తవిచక్షణుడు; అగుచున్ = ఔతు; అవ్యయ = తరగని; ఆనందమును = ఆనందమును; పొందును = పొందుతాడు; అనుదినంబున్ = ఎల్లప్పుడు; అతడు = అట్టివాడు; కర్మవిముక్తుడు = మోక్షముపొందినవాడు; ఔను = అగును; అనఘచరిత్ర = పాపములేనివర్తనుడా.

భావము:

“ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.