పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-94-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.

టీకా:

అంత = అప్పుడు; యదు = యాదవ; ప్రవరుండు = వంశస్థుడు; దేహి = శరీరధారి; లోభ = లోభము; మోహ = మోహము; ఆదులన్ = మున్నగువానిని; వర్జించి = విడిచిపెట్టి; జనార్దనుని = నారాయణుని; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; చేరవచ్చున్ = చేరగలము; ఎఱింగింపుమ = తెలుపుము; అనినన్ = అని అడుగగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు.