పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-92-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై
శంరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌.

టీకా:

పంకజనాభుడు = కృష్ణుడు {పంకజనాభుడు - పద్మము నాభియందు కలవాడు, విష్ణువు}; ఉద్దవుని = ఉద్దవుని; పైన్ = మీద; కల = ఉన్నట్టి; కూర్మిని = చెలిమిచేత; చెప్పెన్ = చెప్పను; ఒప్పన్ = చక్కగా; ఎందున్ = ఎక్కడ; అంకిలి = అడ్డు; లేక = లేకుండ; అన్ని = అన్ని; దిశలు = చోట్లకు; చరించుచున్ = తిరుగుతు; నిత్య = ఎల్లప్పుడు; తృప్తుడు = సంతృప్తిచెందినవాడు; ఐ = అయ్యి; శంకర = పరమశివుని; వేష = వేషమును; ధారి = ధరించినవాడు; ఒక = ఒకానొక; సంయమి = యోగి; ఆ = ఆ యొక్క; యదు = యదు; రాజున్ = రాజుని; చేరెన్ = దగ్గరకు వచ్చెను; ఏ = ఏ; వంక = వైపు; నుండి = నుండి; వచ్చితి = వచ్చావు; అని = అని; వాని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అర్థి = ఆసక్తి; ఏర్పడన్ = కనబడునట్లుగా.

భావము:

పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు.