పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-110-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్భమునఁ బరిజ్ఞానము
నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁ డా
విర్భూతుఁ డైనఁ జెడు నం
ర్భావంబైన బోధ మంతయు ననఘా!

టీకా:

గర్భమునన్ = గర్భములో ఉన్నప్పుడు; పరిఙ్ఞానము = విఙ్ఞానము; నిర్భరము = నిండుగా ఉన్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; జీవుని = మానవున; కిన్ = కు; అతడు = అతను; ఆవిర్భూతుడు = జన్మించినవాడు; ఐనన్ = కాగానే; చెడున్ = నశించిపోవును; అంతర్భావంబు = లోననుండునది; ఐన = అయిన; బోధము = ఙ్ఞానము; అంతయున్ = సమస్తము; అనఘా = పాపరహితుడా.

భావము:

ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది.