పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధ్యానం బేక్రియ నిలుచును?
ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా!
ధ్యాప్రకార మంత య
నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!"

టీకా:

ధ్యానంబు = ధ్యానము; ఏ = ఏ; క్రియన్ = విధముగ; నిలుచును = నిలబడుతుంది; ధ్యానంబు = ధ్యానము; ఏ = ఏ; రీతిన్ = విధమైతే; తగున్ = తగినదై ఉండును; ఉదాత్తచరిత్ర = గొప్పప్రవర్తనగలవాడా; ధ్యాన = ధ్యానము యొక్క; ప్రకారంబు = విషయము; అంతయు = సమస్తమును; అనూనంబుగన్ = పూర్తిగా; చెప్పుము = తెలియజెప్పుము; అయ్య = నాయనా; ఉర్వీరమణ = కృష్ణా {ఉర్వీరమణ - భూమికి భర్త, విష్ణువు}.

భావము:

అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.”