పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : ప్రభాసంకు బంపుట

 •  
 •  
 •  

11-87-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాక ఘూకంబులు నకసౌధములలోఁ$
గలు వాపోయెడి హువిధముల
శ్వవాలములందు నల ముద్భవ మయ్యె$
న్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల$
జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె$
బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.

11-87.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
రయ నిందుండ వలవదు దువులార!
డయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
నుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

టీకా:

కాక = కాకులు; ఘూకంబులు = గుడ్లగూబలు; కనక = బంగారు; సౌధంబుల = మేడల; లోన్ = లోపల; పగలు = పగటిపూట; వాపోయెడిన్ = ఏడుస్తున్నాయి; బహు = పెక్కు; విధములన్ = విధములుగా; అశ్వముల = గుఱ్ఱముల; వాలములు = తోకల; అందున్ = అందు; అనలము = మంటలు; ఉద్భవమయ్యెన్ = జనించినవి; నన్నంబున్ = చిగుర్లు; మొలిచె - మొలిచెన్ = పుట్టినవి; మహా = మిక్కిలి; అద్భుతముగన్ = ఆశ్చర్యకరముగ; శుక = చిలుకలు; శారికలు = గోరింకలు; రాత్రి = రాత్రివేళ; సొగసెన్ = అరుస్తున్నవి; విస్వరములన్ = వికృత స్వరాలతో; జంతువు = ఒక జంతువు; వేఱొక్క = మరొక; జంతువున్ = జంతువును; కనెన్ = కంటున్నది; ఒగిన్ = క్రమముగ; పౌర = పౌరుల; గృహములన్ = నివాస గృహాలలో; ఉల్కలునున్ = మిణుగురులు; ఉదయించె = పట్టుచున్నవి; బెరసెన్ = కమ్ముకొనెను; కావిరి = చీకట్లు; రవి = సూర్య; బింబము = మండలము; అపుడు = అప్పుడు; కానన్ = చూచుటకు; ఉత్పాతములు = అపశకునములు.
చాలన్ = అనేకము; కానబడియె = కనబడినవి; అరయ = తరచిచూసినచో; ఇందున్ = ఇక్కడ; ఉండన్ = ఉండుట; వలవదు = వద్ధు; యదవులారా = యాదవులు; తడయకన్ = ఆలస్యము చేయకుండ; ఇపుడు = ఇప్పుడు; ప్రభాసతీర్థమున్ = ప్రభాసతీర్థమున; కున్ = కు; అరుగుడు = వెళ్ళండి; అనుచున్ = అని; శ్రీకృష్ణుడు = కృష్ణుడు; ఎంతయున్ = గట్టిగా; ఆనతిచ్చెన్ = చెప్పెను.

భావము:

శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.