పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వైకుంఠం మరలఁ గోరుట

  •  
  •  
  •  

11-85-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిలలోకేశ! సర్వేశ! భవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దరిమితంబు
య్యె విచ్చేయు వైకుంఠ ర్మ్యమునకు.

టీకా:

అఖిలలోకేశ = శ్రీకృష్ణ {అఖిలలోకేశుడు - సర్వ జగత్తులకు ఈశుడు, విష్ణువు}; సర్వేశ = శ్రీకృష్ణ {సర్వేశుడు - సర్వ నియామకుడు, విష్ణువు}; అభవ = శ్రీకృష్ణ {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; నీవునున్ = నీవు; ఉదయము = అవతారము; అందుట = పొందుట; భూభారమున్ = భూమిభారమును; ఉడుపు = తగ్గించుట; కొఱకున్ = కోసము; పంచవింశోత్తరశతా = నూటఇరవైయైదు (125); అబ్ద = సంవత్సరముల; పరిమితంబు = పాటి కాలము; అయ్యెన్ = అయినది; విచ్చేయు = రమ్ము; వైకుంఠహర్మ్యమున్ = వైకుంఠనగరమున; కున్ = కు.

భావము:

“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.”