పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వైకుంఠం మరలఁ గోరుట

  •  
  •  
  •  

11-83-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు గరుడ ఖచర విద్యా
హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సిజనయనునిఁ గనుఁగొన
రుదెంచిరి ద్వారవతికి తిమోదమునన్‌.

టీకా:

సుర = దేవతలు; గరుడ = గరుడులు; ఖచర = దేవయోనిజనితులు {ఖచరులు - ఖ (ఆకాశమున) చరులు (గమనముగలవావారు), దేవతలు}; విద్యాధర = విద్యాధరులు; హర = పరమశివుడు; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున ఉండువాడు, బ్రహ్మ}; ముఖ = మున్నగు; సుధాశనులు = దేవతలు; మునుల్ = మునులు; సరసిజనయనునిన్ = పద్మాక్షుని, కృష్ణుని; కనుగొన = చూచుటకు; అరుగుదెంచిరి = వచ్చిరి; ద్వారవతి = ద్వారకానగరమున; కిన్ = కు; అతి = మిక్కిలి; మోదమునన్ = సంతేషముతో.

భావము:

“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు.