పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-80-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

\మలాక్షపదభక్తి థనముల్‌ వసుదేవ!-
విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి-
కైవల్యలక్ష్మియుఁ లుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ-
మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
తఁడు నీ తనయుఁడై వతరించుటఁజేసి-
సిద్ధించె దేహసంశుద్ధి నీకు

11-80.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక,
ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి.

టీకా:

కమలాక్ష = హరి; పద = పాదములందలి; భక్తిన్ = భక్తి వివరించు; కథనముల్ = వృత్తాంతములు; వసుదేవ = వసుదేవుడా; విని = ఆలకించి; అఘంబులన్ = పాపములను; పాసి = తొలగి; వెలసితివి = విలసిల్లితివి; ఈవు = నీవు; భువన = లోకమంతటను; ప్రసిద్ధి = ప్రఖ్యాతి; కాన్ = కలుగునట్లు; పొలుపొందు = ఒప్పారు; సత్ = గొప్ప; కీర్తిన్ = యశస్సు; కైవల్య = కైవల్యము చెందుట అను; లక్ష్మియున్ = సంపద; కలుగున్ = సిద్ధించును; మీదన్ = భవిష్యత్తులో; నారాయణుండు = కృష్ణుడు; నీ = నీ యొక్క; నందనుండు = కుమారుడు; అను = అనెడి; మోహమున్ = మోహమును; ఎడలించి = తొలగించి; విష్ణున్ = విష్ణుమూర్తి; కాన్ = ఐనట్లు; ఎఱిగి = తెలిసికొని; కొలువుము = సేవించుము; అతడు = అతను; నీ = నీ యొక్క; తనయుడు = కుమారుడు; ఐ = అయ్యి; అవతరించుటన్ = పుట్టుట; చేసి = వలన; సిద్ధించెన్ = కలిగెను; దేహ = శరీరమునకు; సంశుద్ధి = పరిశుద్ధి; నీ = నీ; కున్ = కు.
సరస = సరసమైన; సల్లాప = సంభాషణలు; సౌహార్ద = సుహృద్భావ; సౌష్ఠవమునన్ = చక్కదనముచేత; పావనంబు = పవిత్రము; ఐతి = అయినావు; శిశుపాల = శిశుపాలుడు; పౌండ్ర = పౌండ్రకుడు; నరక = నరకాసురుడు; ముర = మురాసురుడు; జరాసంధ = జరాసంధుడు; యవనులు = కాలయవనుడులు; ముదము = హర్షము; తోడన్ = తోటి; వాసుదేవునిన్ = విష్ణునియందైక్యమగుట; చెందిరి = పొందిరి; వైరులు = శత్రుభావము కలవారు; అయ్యున్ = అయినప్పటికి.

భావము:

“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు.