పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-78-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి
హ్యజా కృతమాలాది కలనదుల
కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ
బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు.

టీకా:

ద్రవిడ = ద్రావిడ; దేశంబున్ = దేశము; అందులన్ = లో; తామ్రపర్ణి = తామ్రపర్ణి; సహ్యజ = కావేరి; కృతమాలా = కృతమాల; ఆది = మున్నగు; సకల = అన్ని; నదుల = నదుల; కిన్ = కు; ఎవ్వడు = ఎవరు; ఏనిని = అయినను; భక్తి = భక్తి; తోన్ = తోటి; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; పొదిలి = అతిశయించి; తర్పణమున్ = తర్పణములను; ఒగిన్ = చక్కగా; చేయన్ = చేసినచో; పుణ్యము = పుణ్యము; ఒదవు = కలుగును.

భావము:

ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.