పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-76-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" యుగంబునందు నే రీతి వర్తించు?
నెట్టి రూపువాఁడు? నెవ్విధమున
మును నుతింపఁబడెను మునిదేవగణముచే
విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?

టీకా:

ఏ = ఏ ఏ; యుగంబునన్ = యుగములందు; ఏ = ఏ ఏ; రీతిన్ = ప్రకారముగా; వర్తించున్ = చరించును; ఎట్టి = ఎలాంటి; రూపు = రూపములధరించిన; వాడు = వాడు; ఏ = ఏ ఏ; విధమునన్ = విధముగ; మునున్ = పూర్వము; నుతింపబడెను = స్తుతించబడెను; ముని = మునుల; దేవ = దేవతల; గణము = సమూహముల; చేన్ = చేత; విష్ణుడు = హరి {విష్ణువు - విశ్వమునందు వ్యాపించి ఉండువాడు, హరి}; అవ్యయుండు = హరి {అవ్యయుండు - తరుగుట లేనివాడు, విష్ణువు}; విశ్వవిభుడు = హరి {విశ్వవిభుడు - సకలలోకాలకి ప్రభువు, విష్ణువు}.

భావము:

“అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”