పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-73-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?” ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి “యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ” డనినఁ జమసుం డిట్లనియె

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రవర్తిల్లిన = విలసిల్లినట్టి; శ్రీమత్ = శ్రీమంతుడైన; నారాయణమూర్తి = హరి యొక్క; లీలా = లీలల; విలాసంబు = విలాసములు; అనంతంబులు = అనేకములు; కలవు = ఉన్నాయి; మనః = మనసుతో; వాక్కు = నోటితో; కర్మంబులన్ = పనులతో; హరి = విష్ణు; పూజనంబు = భక్తిని; చేయక = చేయకుండ; విపరీత = ఇతరమైన; గతులన్ = విధములుగ; తిరుగుచుండు = మెలగెడి; జడులు = మూఢుల; కిన్ = కు; ఏ = ఏ; విధంబు = విధము; అగు = ఐన; గతి = సుస్థితి; కలుగున్ = కలుగుతుందా, కలుగదు; అనినన్ = అని పలికిన; ఆ = ఆ; పుడమిఱేడు = భూనాథుడు, రాజు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమ = పావనమైన; పురుషున్ = పురుషుని; చూచి = చూసి; అట్టి = అటువంటి; జడులు = మూఢులు; ముక్తిన్ = మోక్షమును; ఒందు = పొందెడి; ఉపాయంబు = ఉపాయము; ఎట్టులు = ఎలాగ; అంతయున్ = ఇది సమస్తము; ఎఱిగింపుడు = తెలుపండి; అనినన్ = అనగా; చమసుండు = చమసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసు డనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు.