పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-72.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి
పద, పరశుధర, దశవన విదళన,
మురదమన, కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సుర రుడ వినుత!

టీకా:

నవ = కొత్తగా, తాజా; వికచ = వికసించిన; సరసిరుహ = పద్మములవంటి; నయన = కన్నుల; యుగ = జంట కలవాడా; నిజ = తన యొక్క; చరణ = పాదముల; గగనచరనది = దేవగంగ {గగనచరనది - ఆకాశమునందు వర్తించు నది, గంగ}; జనిత = పుట్టించినవాడా; నిగమ = వేదములచే; వినుత = స్తుతింపబడినవాడా; జలధిసుత = లక్ష్మీదేవి {జలధిసుత - అమృత మథన కాలమందు సముద్రమున పుట్టిన దేవి, లక్ష్మి}; కుచ = వక్షోజములనెడి; కలశ = కలశములందిలి; లలిత = మనోజ్ఞమైన; మృగమద = కస్తూరిచే; రుచిర = చక్కటి; పరిమిళిత = సువాసనుగల; నిజ = తన; హృదయ = హృదయము కలవాడా; ధరణి = భూమిని; భరణ = మోసినవాడా; ద్రుహిణ = బ్రహ్మదేవుడు; ముఖ = మొదలగు; సుర = దేవతల; నికర = సమూహముల; విహిత = చేయబడిన; నుతి = స్తుతించుట; కలిత = కలిగిన; గుణ = గుణములు కలవాడా; కటి = నడుమునకు; ఘటిత = కట్టిన, ధరించిన; రుచిరతర = మిక్కిలి ప్రకాశవంతమైన {రుచిరము - రుచిరతరము - రుచిరతమము}; కనక = బంగారు; వసన = చేలము కలవాడా; భుజగరిపు = గరుత్మంతుడు {భుజగరిపుడు - సర్పములకు శత్రువైనవాడు, గరుత్మంతుడు}; వర = ఉత్తమమైన; గమన = వాహనముగా కలవాడా; రజతగిరిపతి = పరమ శివునిచే {రజతగిరిపతి - రజతగిరి (కైలాసపర్వతము) పై నుండు పతి (ప్రభువు), శివుడు}; వినుత = స్తుతింపబడువాడా; సతత = నిరంతర; జప = జపముచేసేవారియందు; రత = ఆసక్తి కలవాడా; నియమసరణి = నియమబద్ధమైన; చరిత = వర్తన కలవాడా.
తిమి = మత్యావతారము; కమఠ = కూర్మావతారము; కిటి = వరాహావతారము; నృహరి = నరసింహావతారము; ముదితబలినిహితపద = వామనావతారము {ముదితబలినిహితపద - ముదిత (సంతోషము నొందిన) బలిచక్రవర్తిని నిహిత (తొక్కిన) పద (పాదములు కలవాడు), వామనుడు}; పరశుధర = పరశురామావతారము {పరశుధరుడు - పరశువు (గొడ్డలి)ని ధరించినవాడు, పరశురాముడు}; దశవదనవిదళన = రామావతారము {దశవదనవిదళనుడు - దశవదను (పదితలలవాడు, రావణాసురు)ని విదళన (సంహరించినవాడు), రాముడు}; మురదమన = కృష్ణావతారము {మురదమనుడు - మురాసురుని చంపినవాడు, కృష్ణుడు}; కలికలుషసుముదపహరణ = కల్క్యవతారము {కలికలుషసుముదపహరణ - కలియుగమున కలుగు కలుష (పాపములను) సు (మిక్కిలి) ముద (సంతోషముతో) అపహరణ (తొలగించువాడు), కల్కి}; కరి = గజేంద్రుని; వరద = వరమిచ్చినవాడా; ముని = మునులచేత; నర = మానవులచేత; సుర = దేవతలచేత; గరుడ = గురుడులచేత; వినుత = స్తుతింపబడినవాడా.

భావము:

“నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!”