పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-71-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేషభాషాపతులకైన నలవి గాదు; మఱియును.
^ విష్ణుమూర్తి అవతారాలు

టీకా:

అట్టి = అటువంటి; పరమేశ్వరుని = నారాయణునిచేత; లీలా = లీలగా; గృహీతంబు = గ్రహింపబడినవి; అగు = ఐన; మత్స్య = మత్యావతారము; కూర్మ = కూర్మావతారము; వరాహ = వరాహావతారము; నారసింహ = నరసింహావతారము; వామన = వామనావతారము; రామ = పరశురామావతారము; రఘురామ = రామావతారము; రామ = బలరామావతారము; బుద్ధ = బుద్ధావతారము; కల్క్య = కల్క్యవతారము; ఆది = మున్నగు; అవతారంబులు = అవతారములు; అనేకంబులు = చాలా; కలవు = ఉన్నాయి; వానిని = వాటిని; ఎఱిగి = తెలిసి; నుతియింపన్ = స్తుతించుటకు; శేష = ఆదిశేషుని (వేయితలల); భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (సరస్వతీదేవికి) పతి (భర్త), బ్రహ్మ}; కైనను = కైనప్పటికి; అలవి = శక్యము; కాదు = కాదు; మఱియును = ఇంకను.

భావము:

అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు.