పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-68.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ!
మణ లోఁగొను మా యపరాధ" మనుచు
న్నుతించిన నతఁడు ప్రన్నుఁ డగుచుఁ
నదు సామర్థ్య మెఱిఁగింపఁ లఁచి యపుడు.

టీకా:

దేవ = దివ్యమైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; నీ = నీ యొక్క; దివ్య = మహిమాన్వితమైన; చారిత్రంబున్ = చరిత్రను; ఎఱిగి = తెలుసుకొని; సన్నుతి = స్తోత్రము; చేయన్ = చేయుటకు; ఎవ్వడు = ఎవరుమాత్రము; ఓపున్ = చేయగలడు; పుత్ర = పుత్రులు; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్య; భోగ = భోగములు; ఆదులను = మొదలగువానిని; మాని = విడిచిపెట్టి; తపమున్ = తపస్సును; కావించు = చేసెడి; సద్ధర్ముల్ = సద్ధర్మపరుల; కును = కు; విఘ్నముల్ = అడ్డంకులు; చెందునే = కలుగుతాయా, కలుగవు; విశ్వేశున్ = జగదీశ్వరుని; కొల్చిన = సేవించు; అతని = వాని; కిన్ = కి; అంతరాయంబున్ = ఆటంకము; కలదె = కలుగునా, కలుగదు; కామంబున్ = కామము; క్రోధంబు = క్రోధము; కల = ఉన్నట్టి; తపస్వి = తాపసుని; తపంబు = తపస్సు; పల్వల = చిన్ననీటిగుంటలోని; ఉదకముల = నీళ్ళు; భంగిన్ = వలె; కాదె = కదా.
నిన్ను = నిన్ను; వర్ణింపన్ = స్తుతించుట; అలవియె = శక్యమా, కాదు; నిర్మలాత్మా = నిర్మలమైన మనసు కలవాడా; రమణన్ = ప్రీతితో; లోగొను = కాయుము, క్షమించుము; మా = మా యొక్క; అపరాధమున్ = తప్పులను; అనుచు = అంటు; సన్నుతించినన్ = స్తుతించగా; అతడు = అతను; ప్రసన్నుడు = ప్రసన్నుడు; అగుచున్ = ఔతు; తనదు = తన యొక్క; సామర్థ్యము = శక్తిని; ఎఱిగింపన్ = తెలుపవలెనని; తలచి = అనుకొని; అపుడు = అప్పుడు.

భావము:

“దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుంతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.