పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-64-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నారాయణాహ్వయుం డైన మౌని
దరికాశ్రమమందు నపార నిష్ఠఁ
పముఁ గావింప బలభేది లఁకి మదిని
మీనకేతను దివిజకామినులఁ బనిచె.

టీకా:

అట్టి = అటువంటి; నారాయణ = నారాయణ; ఆహ్వయుండు = పేరుకలవాడు; ఐన = అయిన; మౌని = ముని; బదరికాశ్రమము = బదరికాశ్రమము; అందున్ = లో; అపార = అనంతమైన; నిష్ఠ = నిష్ఠతో; తపమున్ = తపస్సును; కావింపన్ = చేయగా; బలభేదిన్ = ఇంద్రుడు {బలభేది - బలాసురుని సంహరించినవాడు, ఇంద్రుడు}; తలకి = బెదిరి; మదిని = మనసునందు; మీనకేతను = మన్మథుని; దివిజకామినులన్ = అప్సరసలను; పనిచెన్ = పంపించెను.

భావము:

ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు.