పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-63-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ముండు దక్షపుత్త్రిక
నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స
త్కర్ముని నారాయణ ఋషి
ర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌.

టీకా:

ధర్ముండు = ధర్ముడు; దక్ష = దక్షుని యొక్క; పుత్రికన్ = కుమార్తెను; నిర్మల = అమలమైన; మతిన్ = బుద్ధితో; పెండ్లియాడి = వివాహముచేసికొని; నెఱిన్ = గొప్పగా; పుత్త్రుని = కుమారుని; సత్ = మంచి; కర్ముని = కర్మలు చేయువానిని; నారాయణ = నారాయణుడనెడి; ఋషిన్ = ఋషిని; నర్మిలిన్ = కోరి, ఇష్టపూర్తిగా; కనెన్ = పొందెను; అతడు = అతను; బదరికాశ్రమము = బదరికాశ్రమము; అందున్ = అందు.

భావము:

బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు.