పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికా వస్త్రాపహరణము

  •  
  •  
  •  

10.1-838-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱు వెడలుద మందురు;
కొంఱు వెడలుటయు సిగ్గుఁగొను గోవిందుం
డందురు; కొందఱు దమలోఁ
గొంల మందుదురు వడఁకుఁగొని మనుజేంద్రా!

టీకా:

కొందఱు = కొంతమంది; వెడలుదము = వెళ్దాము; అందురు = అనుచున్నారు; కొందఱు = కొంతమంది; వెడలుటయున్ = వెళ్ళగానే; సిగ్గున్ = సిగ్గిలునట్లు; కొనున్ = చేయును; గోవిందుండు = కృష్ణుడు; అందురు = అనుచున్నారు; కొందఱున్ = కొంతమంది; తమలో = మనసు లందు; కొందలము = కలత; అందుదురు = పడుదరు; వడకున్ = వణికి; కొని = పోతు; మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.

భావము:

ఓ పరీక్షన్మహారాజా! చలికి గడగడ లాడుతూ ఆ కన్నెలలో కొందరు “బయటకు వెళదాం” అంటారు; “వెళితే శ్రీ కృష్ణుడు మన సిగ్గు తీయడం తధ్యం” అంటారు మరికొందరు; ఇంకొందరు ఎటూతోచక తమలో ఆందోళన చెందుతున్నారు.