పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల కాత్యాయని సేవనంబు

  •  
  •  
  •  

10.1-812-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణుల్ ప్రొద్దుల మేలుకాంచి సఖులన్ రం డంచు నాత్మీయ నా
ములం జీరి, కుచద్వయీ భరములన్ ధ్యంబు లల్లాడఁగాఁ
బ్రదోద్దామ గజేంద్రయాన లగుచుం ద్మాక్షునిం బాడుచున్
మునాతీరముఁ జేరఁబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై.

టీకా:

రమణుల్ = స్త్రీలు; ప్రొద్దులన్ = ఉదయమే; మేలుకాంచి = నిద్రలేచి; సఖులన్ = స్నేహితురాళ్ళను; రండు = రండి; అంచున్ = అని పిలుచుచు; ఆత్మీయ = వారివారి; నామములన్ = పేరులతో; చీరి = పిలిచి; కుచ = పాలిండ్ల; ద్వయీ = జంట యొక్క; భరమునన్ = బరువుచేత; మధ్యంబులు = నడుములు; అల్లలాడగాన్ = ఊగిపోతుండగా; ప్రమోద్దామ = అధికమైన సంతోషము చేత; గజ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠములవంటి; యానలు = నడకలు కలవారు; అగుచున్ = అగుచు; పద్మాక్షునిన్ = కృష్ణుని; పాడుచున్ = స్తుతించుచు; యమునా = యమునానదీ; తీరమున్ = గట్టు; చేరన్ = దగ్గరకు; పోయిరి = వెళ్ళిరి; గృహీత = పట్టుకోబడిన; అన్యోన్య = ఒండొరుల; హస్త = చేతులు అనెడి; అబ్జలు = పద్మములు కలవారు; ఐ = అయ్యి.

భావము:

ఒకరోజు గోపికలు తెల్లవారగట్ల మేల్కొన్నారు. “రండి రండి” అని తమ స్నేహితురాళ్ళను పేరు పేరున పిలుచుకుంటూ, చనుగవ బరువుకి నడుములు ఊగిస లాడుతూ ఉండగా, ఒకరి చేయి మరొకరు పట్టుకుని బయలుదేరారు కమలాక్షుని మీద పాటలు పాడుతూ సమద గజేంద్ర గమనులై యమునానదీ తీరానికి చేరుకున్నారు.