పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-797-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృష్ణాంఘ్రిసరోజ సంగమముచే భాసిల్లుచున్ ధన్యమై
పుష్పంబులఁ గానికల్ గురిసి సంభావించి మిన్నందుచున్
ఘాసంబుల గోవులం దనిపి చంద్భూజరోమాంచమై
వెసెం జూడఁ గదమ్మ! యీ గిరిపురోవీధిన్ సరోజాననా!"

టీకా:

బల = బలరాముడు; కృష్ణ = కృష్ణుల; అంఘ్రి = పాదము లనెడి; సరోజ = పద్మములతో; సంగమము = కలియ గలుగుట, సోకుట; చేన్ = వలన; భాసిల్లుచున్ = ప్రకాశించుచు; ధన్యము = కృతార్థమైనది; ఐ = అయ్యి; ఫల = పండ్లు; పుష్పంబులన్ = పువ్వులు అనెడి; కానికల్ = కానుకలను; కురిసి = సమృద్ధిగా ఇచ్చి; సంభావించి = గౌరవించి; మిన్నుందుచున్ = మిన్నుముట్టుచు; జల = నీళ్ళచేతను; ఘాసంబులన్ = గడ్డిచేతను; గోవులన్ = ఆవులను; తనిపి = తృప్తిపొందించి; చంచత్ = కదులుతున్న; భూజ = చెట్లు అనెడి; రోమాంచము = గగుర్పాటులు కలది; ఐ = అయ్యి; వెలసెన్ = ప్రకాశించెను; చూడగద = చూడుము; అమ్మ = తల్లి; ఈ = ఈ యొక్క; గిరి = కొండ; పురోవీధిన్ = మన ఎదుటి భాగమున; సరోజాననన = సుందరి {సరోజానన - సరోజ (పద్మముల వంటి) ఆనన (మోముకలామె), స్త్రీ}.

భావము:

ఓ పద్మముఖీ! మన ఎదురుగా ఉన్న ఈ కొండను చూడవమ్మా! ఈ పర్వతం బలరామకృష్ణుల పాదపద్మాల సంస్పర్సతో ధన్యత పొంది ప్రకాశిస్తున్నది. పండ్లు పూలు అనే కానుకలను సమర్పించి వారిని సత్కరిస్తున్నది. ఆనందంతో ఆకాశం అందుకుంటోంది. నీటితో కసవుతో ధేనువుల తనివితీరుస్తున్నది. అందమైన తరువులనే గగుర్పాటుతో కనువిందు చేస్తున్నది.”