పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-795-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లసిత కుచభరంబున
ల్లాడెడి నడుముతోడ లరుల దండన్
భిల్లి యొకతె హరి కిచ్చెను
ల్లోహలకలిత యగుచు నంగన! కంటే?

టీకా:

ఉల్లసిత = ఉప్పొంగిన, నిక్కిన; కుచ = స్తనముల; భరంబునన్ = బరువులచేత; అల్లాడెడి = ఊగిపోతున్న; నడుము = నడుము; తోడన్ = తోటి; అలరుల = పూల; దండన్ = మాలను; భిల్లి = ఎరుక యువతి; ఒకతె = ఒకామె; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇచ్చెను = ఇచ్చెను; హల్లోహల = సంభ్రమము, తొట్రుపాటు, ఆదరము; కలిత = కలామె; అగుచున్ = అగుచు; అంగన = సుందరి; కంటె = చూసితివా.

భావము:

ఓ మానినీ! చూసావా? ఒక బోయత ఉప్పొంగే కుచముల బరువుతో జవ్వాడే నడుముతో భావావేశంతో పూల మాలికను కృష్ణుడికి సమర్పించింది. కన్నావుటే.