పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-789-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లుల చన్నుఁబాలు మును ద్రావు తఱిం దమకర్ణవీధులన్
ల్లభమైన మాధవుని వంశరవామృతధార చొచ్చినం
ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక కృష్ణుమీఁద దృ
గ్వల్లులు చేర్చి నిల్చె నదె; త్సము లంగనలార! కంటిరే?

టీకా:

తల్లులు = తల్లుల యొక్క; చన్నుబాలు = స్తన్యము; మును = ఇంతకుముందు; త్రావు = తాగెడి; తఱిన్ = అప్పుడు; తమ = వాటి; కర్ణ = చెవుల; వీధులన్ = మార్గములద్వారా; వల్లభము = ప్రీతికరము; ఐన = అయిన; మాధవుని = కృష్ణుని; వంశ = వేణు; రవ = గానము అనెడి; అమృత = అమృతపు; ధార = పరంపరలు; చొచ్చినన్ = దూరగా; త్రుళ్ళకన్ = గెంతులేయకుండ; పాలు = స్తన్యము; రాన్ = వచ్చునట్లు; తివక = పీల్చుకొనకుండ, తాగక; దూటక = మూతితో పొడిచి చేపకుండ; మానక = వదలకుండ; కృష్ణు = కృష్ణుని; మీదన్ = మీద; దృక్ = చూపు లనెడి; వల్లులున్ = తీగలను; చేర్చి = ఉంచి; నిల్చెన్ = నిలుచున్నవి (కదలక); అదె = అదిగో; వత్సములు = దూడలు; అంగనలార = అందగత్తెలు {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; కంటిరె = చూచితిరా.

భావము:

ఓ వనితలారా! చూసారా. లేగలు తల్లి ఆవుల పాలు కుడిచే వేళ ప్రియమైన మాధవుడు కృష్ణుడి వేణుగాన సుధాదార చెవులలో పడడంతో అవి తుళ్ళిపడటం మానేసాయి. పాలు పీల్చకుండా; పొదుగు కుమ్మకుండా; ఊరక చన్నులను నోటిలో ఉంచుకుని; చిన్నికృష్ణుడి మీదనే కన్నులుంచి; అలాగే చూస్తూ నిలబడిపోయాయి.