పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-785-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితా! కృష్ణుఁడు నల్లని
మనియున్ వేణురవము ర్జన మనియున్
మునఁ దలంచి రొప్పుచు
వరతము నెమలితుటుము లాడెడిఁ గంటే?

టీకా:

వనితా = స్త్రీ; కృష్ణుడు = కృష్ణుడు; నల్లని = నల్లటి; ఘనము = మేఘము; అనియున్ = అని; వేణు = మురళీ; రవము = నాదము; గర్జనము = ఉరుము; అనియున్ = అని; మనమునన్ = మనసు నందు; తలచి = భావించి; రొప్పుచున్ = కేకలువేయుచు; అనవరతము = ఆగకుండగ; నెమలి = నెమళ్ళ; తుటుములు = సమూహములు; ఆడెడిన్ = నాట్యము చేయుచున్నవి; కంటే = చూసితివా.

భావము:

పడతీ! నళినాక్షుడు కృష్ణుడు నల్లని మేఘమనీ; మురళీ నినాదం ఉరుమనీ; మదిలో భావించి ఎడతెరపి లేకుండా కేకారవాలు గావిస్తూ, నెమళ్ళు పురివిచ్చి నాట్యాలు చేస్తున్నాయి చూసావా.