పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-782-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళినోదరుభక్తునిఁ గని
కుజులు ప్రమదాశ్రుజలము గురియు తెఱఁగు మ్రాఁ
కులు పూదేనియ లొలికెడు
లినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్.

టీకా:

నళినోదరు = విష్ణుమూర్తి; భక్తుని = భక్తుడుని; కని = చూసి; కులజులు = స్వకులస్థులు; ప్రమద = సంతోషపు; అశ్రుజలమున్ = కన్నీటిని; కురియన్ = కార్చు; తెఱగున్ = విధముగా; మ్రాకులు = చెట్లు; పూదేనియలు = మకరందములను; ఒలికెడున్ = కార్చుచున్నవి; నలినాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; చేతి = చేతిలోని; వంశనాళము = వేణువు; మ్రోతన్ = నాదమువలన.

భావము:

పద్మనాభుడైన విష్ణుమూర్తి యొక్క భక్తుడిని చూసిన అతని కులం వారు ఆనందబాష్పాలు కార్చినట్లు, కమలాక్షుడు శ్రీకృష్ణుని కమ్మని పిల్లనగ్రోవి పాటలు విని చెట్లు పూదేనియలు జాలువారుస్తున్నాయి.