పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-780-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రన్ వ్రేతల కించుకేనియును లేకుండంగ గోపాలకృ
ష్ణుని కెమ్మోవి సుధారసంబు గొనుచుం జోద్యంబుగా మ్రోఁయుచుం
పర్వంబులు నేత్రపర్వములుగా ర్పించెఁ, బూర్వంబునన్
నితా! యెట్టి తపంబు జేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్.

టీకా:

ఒనరన్ = చక్కగా; వ్రేతల = గోపికల; కున్ = కు; ఇంచుక = కొద్దిగా; ఏనియును = ఐయినను; లేకుండగన్ = మిగలకుండునట్లుగా; గోపాల = గోవులను పాలించెడి; కృష్ణుని = కృష్ణుని యొక్క; కెంపు = ఎఱ్ఱని; మోవి = పెద వనెడి; సుధా = అమృతపు; రసంబున్ = ఊటను; కొనుచున్ = తీసికొనుచు; చోద్యంబుగా = వింతగా; మ్రోయుచున్ = పలుకుచు; తన = తన యొక్క; పర్వంబులు = కణుపులు; నేత్ర = కన్నులకు; పర్వములు = పండుగులు; కాన్ = అగునట్లుగా; దర్పించెన్ = గర్వించెను; పూర్వంబునన్ = పూర్వజన్మమునందు; వనితా = పడతీ; ఎట్టి = ఎలాంటి; తపంబున్ = తపస్సును; చేసెనొకొ = చెసినదోకదా; ఈ = ఈ యొక్క; వంశంబు = వేణువు; వంశంబు = జాతి; లోన్ = అందు.

భావము:

“సుందరీ! ఈ వేణువు ఉంది చూసావూ, మునుపు ఏం తపస్సులు చేసిందో కాని. ఇలా వెదురు వంగడంలో జన్మించింది. ఇప్పుడు ఈ పిల్లనగ్రోవి అయి, కృష్ణుడి మోవిని అందుకుంది. గొల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అరుణ అధరసుధలను ఆస్వాదిస్తూ వింతమ్రోత లీనుతున్నది. తన స్వరా లొలికే వెదురు కణుపులతో అందగిస్తూ కనులపర్వం గావిస్తూ వెదురుల కులంలో నేనే గొప్పదాన్ని అని గర్వంతో మిడిసి పడుతున్నది.