పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వర్షర్తు వర్ణనము

  •  
  •  
  •  

10.1-759-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీనము చాలఁ గలిగియుఁ
గారమున మిట్టిపడని నునిక్రియ నదీ
జీనములు చొర జలనిధి
ప్రావృట్కాలమున డిందుడి యుండె నృపా!

టీకా:

జీవనము = మంచి జీవితము; చాలన్ = అధికముగనే; కలిగియున్ = ఉన్నను; కావరమునన్ = గర్వముతో; మిట్టిపడని = మిడిసిపడనట్టి; ఘనుని = గొప్పవాని; క్రియన్ = వలె; నదీ = నదుల యొక్క; జీవనములు = నీళ్ళు; చొరన్ = ప్రవేశించుచున్నను; జలనిధి = సముద్రము; ప్రావృట్కాలమునన్ = వర్ష ఋతువు నందు; డిందుపడి = అణగియే; ఉండెన్ = ఉండెను; నృపా = రాజా.

భావము:

పరీక్షన్నరేంద్రా! ఎంత సంపన్నుడైనప్పటికీ గొప్పవాడు తలపొగరుతో మిడిసిపడడు. అదే విధంగా, నదుల నుండి ఎంత దండిగా నీరు వచ్చి చేరుతున్నా, వానాకాలంలోనూ సాగరుడు హద్దుమీరక అణగి ఉన్నాడు.