పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వర్షర్తు వర్ణనము

  •  
  •  
  •  

10.1-755-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్షాకాలభుజంగుఁడు
ర్షముతో నిడిన నవ నఖాంకము లని యు
త్కర్షింప భూమిసతిపైఁ
ర్షక హలరేఖ లమరె హనాంతములన్.

టీకా:

వర్షాకాల = వర్ష ఋతువు అనెడి; భుజంగుడు = విటుడు; హర్షము = సంతోషము; తోన్ = తోటి; ఇడిన = పెట్టిన; నవ = నూతనమైన; నఖాంకములు = నఖక్షతములు {నఖక్షతములు - గిల్లుటచేత చర్మముపై ఏర్పడు గోటి గుర్తు}; అని = అని; ఉత్కర్షింపన్ = పొగడునట్లుగా; భూమి = భూమి అనెడి; సతి = స్త్రీ; పైన్ = మీద; కర్షక = సేద్యగాని; హల = నాగలి, నాగేటి; రేఖలు = చాళ్ళు; అమరె = అమరి ఉన్నాయి; గహన = అడవి; అంతములన్ = చివరల యందు.

భావము:

వర్షాకాలం అనే విటుడు భూమి అనే అంగన మీద ఆనందంతో క్రొత్తగా పెట్టిన కొనగోటి నొక్కులవలె నేలపై కర్షకులు వేసిన నాగటిచాళ్ళు చక్కగా ఉన్నాయి.