పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వర్షర్తు వర్ణనము

  •  
  •  
  •  

10.1-754-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ-
డమట నింద్రచాపంబు దోఁచెఁ
రివేషయుక్తమై భానుమండల మొప్పె-
మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొడగె
క్షిణగాములై నరె మేఘంబులు-
లచరానీకంబు సంతసించెఁ
జాతకంబుల పిపాలు కడపలఁ జేరెఁ-
గాంతారవహ్నుల ర్వ మడఁగె

10.1-754.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజకరాళివలన నీరజబంధుండు
దొల్లి పుచ్చుకొనిన తోయ మెల్ల
రల నిచ్చుచుండె హిఁ గర్షకానంద
కందమైన వాన కందు వందు.

టీకా:

పూర్వ = తూర్పుకువీచెడి; వాయువులు = గాలులు; ప్రభూతంబులు = హెచ్చినవి; ఐ = అయ్యి; వీచెన్ = వీచినవి; పడమటన్ = పశ్చిమదిక్కునందు; ఇంద్రచాపంబున్ = ఇంద్రధనుస్సు; తోచెన్ = కనబడెను; పరివేష = గుడికట్టుటతో {గుడికట్టుట - ఆకాశమునందు సూర్యునిచుట్టు ఏర్పడెడి ప్రకాశవంతమైన తెల్లని చక్రాకారము తయారగుట}; యుక్తము = కూడినది; ఐ = అయ్యి; భాను = సూర్య; మండలము = బింబము; ఒప్పెన్ = అందగించినది; మెఱుపులు = మెరుపులు; ఉత్తర = ఉత్తరపు; దిశన్ = దిక్కునందు; మెఱవన్ = మెరియుట; తొడగెన్ = సాగెను; దక్షిణ = దక్షిణపువైపు; గాములు = పోవునవి; ఐ = అయ్యి; తనరెన్ = అతిశయించినవి; మేఘంబులు = మబ్బులు; జలచర = జలచరముల; అనీకంబు = సమూహములు; సంతసించెన్ = సంతోషించినవి; చాతకంబుల = చాతకపక్షుల, వానకోకిల; పిపాసలు = దప్పికలు; కడపలజేరెన్ = తుదముట్టెను; కాంతారవహ్నుల = కార్చిచ్చుల; గర్వము = అతిశయము; అడగెన్ = అణగిపోయెను.
నిజ = తన యొక్క; కర = కిరణముల; ఆళి = సమూహముల; వలన = చేత; నీరజబంధుండు = సూర్యుడు {నీరజబంధుడు - నీరజము (కలువపూల)కు బంధువు ఐనవాడు, సూర్యుడు}; తొల్లి = ఇంతకుముందు; పుచ్చుకొనిన = తీసుకొన్నట్టి; తోయము = నీరు; ఎల్లన్ = అంతటిని; మరలన్ = తిరిగి; ఇచ్చుచుండెన్ = ఇచ్చుచుండెను; మహిన్ = భూలోకమునందు; కర్షక = రైతుల, సేద్యగాండ్ర; ఆనంద = సంతోషమునకు; కందము = మూలము; ఐన = అయిన; వాన = వర్ష; కందువ = ఋతువు; అందున్ = అందు.

భావము:

ఇంతలో వర్షాకాలం వచ్చింది. తూర్పుగాలులు విపరీతంగా వీచాయి. పశ్చిమాన ఇంద్రధనుస్సు కనబడింది. చుట్టూ కట్టిన గాలిగుడితో సూర్యుడు చక్కగా ఉన్నాడు. ఉత్తరదిక్కులో మెరుపు మెరిసింది. మబ్బులు దక్షిణదిశకు తిరిగిపోసాగాయి. జలచరాలకు సంతోషం సమకూడింది. చాతకపక్షుల దప్పిక తీరింది. అడవులలోని దావాగ్నులు అణిగిపోయాయి. సూర్యుడు తన కిరణాలతో మునుపు స్వీకరించిన నీటిని అంతటినీ రైతులకు ఆనందదాయకమైన వానాకాలంలో వర్షాల రూపంలో ఇచ్చేస్తున్నాడు