పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రోహిణి బలభద్రుని కనుట

  •  
  •  
  •  

10.1-64-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లము మిగులఁ గలుగ "లభద్రుఁ" డన లోక
మణుఁ డగుటఁ జేసి "రాముఁ" డనగ
తికిఁ బుట్టె గర్భసంకర్షణమున "సం
ర్షణుం" డనంగ నుఁడు సుతుఁడు.

టీకా:

బలము = ఙ్ఞానైశ్వర్య ధైర్య శారీరక శక్తి; మిగులన్ = అధికముగ; కలుగన్ = కలిగి ఉండుటచేత; బలభద్రుడు = బలభద్రుడు; అనన్ = అని పిలవబడుతు; లోక = సమస్త లోకములకు; రమణుడు = సంతోషింప జేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; రాముడు = రాముడు; అనగన్ = అని పిలవబడుతు; సతి = ఇల్లాలు (రోహిణి); కిన్ = కి, అందు; పుట్టెన్ = జన్మించెను, అవతరించె; గర్భ = పిండమును; సంకర్షణమునన్ = మార్పిడి చేయబడుట చేత; సంకర్షణుండు = సంకర్షణుడు; అనగన్ = అని పిలవబడెడి; ఘనుడు = గొప్పవాడు; సుతుడు = పుత్రుడు.

భావము:

రోహిణిగర్భాన చాలా గొప్పవాడు అయిన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అనీ, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అనీ, అందరిని ఆనందింపచేసేవాడు కనుక రాముడు అనీ అతనికి పేర్లు వచ్చాయి.