పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కార్చిచ్చు చుట్టుముట్టుట

  •  
  •  
  •  

10.1-714-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దె వచ్చెన్ దవవహ్ని ధూమకణ కీలాభీల దుర్వారమై
యిదె కప్పెన్ మము నెల్లవారి నిట మీఁ దేలాగు రక్షింపు; నీ
పద్మంబులకాని యొండెఱుఁగ; మో ద్మాక్ష! యో కృష్ణ! మ్రొ
క్కె మో! రామ! మహాపరాక్రమ! దవాగ్నిన్ వేగ వారింపవే.

టీకా:

అదె = అదిగో; వచ్చెన్ = వచ్చేస్తున్నది; దవవహ్ని = దావాగ్ని; ధూమ = పొగచేతను; కణ = ధూళిచేతను; కీలా = మంటలచేతను; ఆభీల = భయంకరత్వముచేతను; దుర్వారంబు = ఆపరానిది; ఐ = అయ్యి; ఇదె = ఇదిగో; కప్పెన్ = కమ్ముకొనెను; మమున్ = మమ్ములను; ఎల్లవారిని = అందరిని; ఇట = ఇక; మీదన్ = పైన; ఏలాగు = ఎలాగో ఏమిటో; రక్షింపు = కాపాడుము; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; పద్మంబులున్ = పద్మములు; కాని = తప్పించి; ఒండు = ఇతరము; ఎఱుంగము = ఎరుగము; ఓ = ఓయీ; పద్మాక్షా = కృష్ణా {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు}; ఓ = ఓయీ; కృష్ణా = కృష్ణా; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఓ = ఓయీ; రామ = బలరాముడా; మహాపరాక్రమ = గొప్పపరాక్రమశాలి; దవాగ్నిన్ = కార్చిచ్చును; వేగన్ = శీఘ్రముగా; వారింపవే = అణచివేయుము.

భావము:

“అదిగో అదిగో దావాగ్ని వచ్చేస్తోంది. పొగలతో, నిప్పురవ్వలతో, అగ్నిజ్వాలలతో ఆపడానికి వీలులేకుండా వచ్చేస్తున్నది. ఇదిగో మమ్మల్ని అందరిని ఆవరించింది. ఇప్పు డేమి చేయడం. ఓ కృష్ణా! పద్మాక్షా! పరాక్రమంతుడవైన బలరామా! మీకు నమస్కరిస్తూన్నాము, మీ పాదపద్మాలు తప్ప మేమేమి ఎరుగము. దావాగ్నిని నివారించి మమ్ము రక్షించండి.