పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళిందుని శాసించుట

  •  
  •  
  •  

10.1-696-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“గోర్గముతో మనుజులు
ద్రావుదు రీ మడుఁగు నీరుఁ; గ దిం దుండన్;
నీవును నీ బాంధవులును
నీ నితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్.

టీకా:

గో = ఆవుల; వర్గము = సమూహము; తోన్ = తోపాటు; మనుజులు = మానవులు; త్రావుదురు = తాగెదరు; ఈ = ఈ; మడుగు = మడుగులోని; నీరున్ = నీటిని; తగదు = యుక్తము కాదు; ఇందున్ = ఈ మడుగు నందు; ఉండన్ = ఉండుట; నీవును = నీవు; నీ = నీ యొక్క; బాంధవులును = చుట్టాలు; నీ = నీ యొక్క; వనితలు = స్త్రీలు; సుతులు = పిల్లలు; చనుడు = వెళ్ళండి; నేడు = ఇవాళ; అంబుధి = సముద్రమున {అంబుధి - అందు (నీటికి) నిధి, కడలి}; కిన్ = కు.

భావము:

“కాళియుడా! ఈ మడుగులోని నీటిని గోవులతో పాటు మనుషులు కూడా తాగుతారు. కనుక, ఇంక నువ్వు ఇక్కడ ఉండ కూడదు. నువ్వు, నీ పెళ్ళం పిల్లలు, బంధువులు అందరితో కలిసి ఇవాళే సముద్రం లోకి వెళ్ళిపోండి.