పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఆలకదుపుల మేప బోవుట

  •  
  •  
  •  

10.1-600.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యరణ్యభూమి నంకించి పసులను
మిత్రజనులు దాను మేపు చుండి
ళినలోచనుండు దులందు గిరులందు
సంతసంబు మెఱయ సంచరించె.

టీకా:

నీ = నీ యొక్క; పాదములున్ = అడుగులు; సోకి = తగిలి; నేడు = ఇవాళ; నీరును = జలము; తృణ = గడ్డి; పుంజంబు = దుబ్బుల; తోన్ = తోపాటు; భూమి = నేల; పుణ్య = పుణ్యవంతమైనది; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; నఖంబులున్ = గోర్లు; తాకి = తగిలి; నేడు = ఇవాళ; నానా = అనేక రకముల; లతా = తీగలు; తరు = చెట్ల; సంఘంబులున్ = సమూహములు; కృతార్థంబులు = ధన్యములు; అయ్యెన్ = అయినవి; నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; దృష్టి = చూపుల; చేన్ = వలన; నేడు = ఇవాళ; నదీ = నదులు; శైల = కొండలు; ఖగ = పక్షులు; మృగంబులున్ = జంతువులు; దివ్య = గొప్ప; కాంతిన్ = ప్రకాశమును; అందెన్ = పొందినవి; నీ = నీ యొక్క; పెన్ = పెద్ద; ఉరము = వక్షస్థలము; మోవన్ = తగులగా; నేడు = ఇవాళ; గోపాంగనా = గోపికాస్త్రీలు; జనముల = సమూహముల; పుట్టువు = జన్మము; సఫలము = ధన్యమైనది; అయ్యెన్ = అయినది; అని = అని.
అరణ్య = అటవీ; భూమిన్ = ప్రదేశమును; అంకించి = పొగిడి; పసులును = ఆవులు; మిత్ర = స్నేహితుల; జనులున్ = సమూహము; తాను = అతను; మేపుచుండి = కాచుచుండి; నళినలోచనుండు = శ్రీకృష్ణుడు {నళినలోచనుడు - నళినము (పద్మముల) వంటి లోచనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; నదులు = ఏరులు; అందున్ = లోను; గిరులు = కొండల; అందున్ = లోను; సంతసంబు = సంతోషము; మెఱయన్ = ప్రకాశింపగా; సంచరించెన్ = మెలగెను.

భావము:

నీ యొక్క పాదాలు సోకి నేడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమై పోయింది. రకరకాల తీగలూ చెట్లూ అన్నీ ఈవేళ నీ గోళ్ళు తాకి ధన్యములయ్యాయి. ఇక్కడ ఉన్న నదులూ పర్వతాలు పక్షులూ జంతువులూ నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలంపై వాలిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి.” ఈవిధంగా పలుకుతూ వనభూములలో ప్రవేశించి తన మిత్రుల తోపాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైననూ ఆనందంగా విహారం చేసాడు.