పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు అత్మీయు డగుట

  •  
  •  
  •  

10.1-593-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీతి పదమను నావను
బ్రాపించి భవాబ్ధి వత్సదముగ ధీరుల్
రూపించి దాఁటి చేరుదు
రాత్పద రహితు లగుచు మృతపదంబున్.

టీకా:

శ్రీపతి = శ్రీవిష్ణుమూర్తి యొక్క; పదము = పాదాశ్రయము; అను = అనెడి; నావను = పడవను; ప్రాపించి =పొంది; భవ = సంసార, జన్మాది; అబ్ధి = సాగరమును; వత్స = దూడ యొక్క; పదము = గిట్టల ముద్ర; కన్ = ఐనట్లు; ధీరుల్ = ఆత్మఙ్ఞాన సంపన్నులు; రూపించి = రూఢి చేసుకుని, నిశ్చయించుకొని; దాటి = తరించి; చేరుదురు = చెందెదరు; ఆపత్ = సకల దుఃఖములకు; పద = స్థానమైన అఙ్ఞానము; రహితులు = విడువబడినవారు; అగుచున్ = అగుచు; అమృత = మరణములేని, ముక్తి; పదంబున్ = స్థానమును.

భావము:

బుద్ధిమంతు లైనవారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని, ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా, అమృత స్థితిని చేరుకుంటారు.