పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు అత్మీయు డగుట

 •  
 •  
 •  

10.1-592-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల జంతువులకు నాత్మవల్లభమైన-
భంగి బిడ్డలు నిండ్లుఁ సిఁడి మొదలు
స్తువు లెవ్వియు ల్లభంబులు గావు-
కలాత్మకుండైన లజనేత్రు
ఖిల జంతువులకు నాత్మ గావున ఘోష-
వాసుల కెల్లను ల్లభత్వ
మున మిక్కిలొప్పెను మూడులోకములకు-
హితము చేయఁగ జలజేక్షణుండు

10.1-592.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మాయతోడ మూర్తిమంతుడై యొప్పారు;
లఁ డతండు నిఖిల ణము లందు
వతిధాతు వెట్లు భావార్థమై సర్వ
ధాతు గణమునందుఁ నరు నట్లు.

టీకా:

అఖిల = సమస్తమైన; జంతువుల = ప్రాణుల; కున్ = కు; ఆత్మ = ఆత్మ; వల్లభము = అతిప్రియమైనది; ఐన = అయినట్టి; భంగిన్ = విధముగా; బిడ్డలున్ = పిల్లలు; ఇండ్లు = నివాసములు; పసిడి = బంగారము; మొదలు = మొదలగు; వస్తువులు = వస్తువులు; ఎవ్వియున్ = ఏవికూడ; వల్లభంబులు = ప్రియతరములు; కావు = కావు; సకల = సమస్తమును; ఆత్మకుండు = తనరూపముగకలవాడు; ఐన = అయినట్టి; జలజనేత్రుడు = కృష్ణుడు {జలజనేత్రుడు - జలజము (పద్మము)ల వంటి నేత్రుడు (కళ్ళు కల వాడు), విష్ణువు};
మాయ = ప్రకృతి; తోడన్ = తోకూడి; మూర్తిమంతుడు = దేహధారి; ఐ = అయ్యి; ఒప్పారు = అతిశయించును; కలడు = ఉన్నాడు; అతండు = అతను; నిఖిల = ఎల్ల; గణములు = జీవజాలము; అందున్ = లోను; భవతిధాతువు = భూధాతువు (సంస్కృతమున); ఎట్లు = ఎలా ఐతే; భావ = క్రియావాచ్యమైన; అర్థము = అర్థముకలది; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన {ధాతుగణము - భ్వాది, అదాది, జుహోత్యాది దివాది సునోత్యాది తుదాది రుధాది తనోత్యాది క్రాది చురాది}; ధాతు = ధాతువుల; గణమున్ = సమూహమున; అందున్ = కును; తనరు = అతిశయించును; అట్లు = ఆ విధముగనే.

భావము:

జీవరాసులు అన్నింటికి “తనకు తాను ఇష్టమైనంత” బిడ్డలు గాని, ఇండ్లు గాని, బంగారం మొదలైన వస్తువులు గాని ప్రియమైనవి కావు. అన్నిటి యందు ఆత్మగా ఉన్న విష్ణువు అన్ని జీవరాసులలో “ఆత్మస్వరూపుడుగా” ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకు అందరికి ప్రియుడై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పద్మముల వంటి కన్నులు ఉన్న విష్ణుమూర్తి మాయతో కూడిన రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా మూడు లోకాలకూ మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకూ “భవతి” అనే ధాతువు భావంగా అంతర్లీనమై ఉంటుంది. అలాగే చరాచర సృష్టి లోని అన్నిటి యందూ విష్ణువు ఉన్నాడు.