పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట

  •  
  •  
  •  

10.1-576-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రయించు జనుల కానందసందోహ
మీఁ దలంచి వివిధ హేలతోడ
ప్రపంచకుండ య్యుఁ బ్రపంచంబు
వెలయఁజేయు దీవు విశ్వమూర్తి!

టీకా:

ఆశ్రయించు = నిన్ను ఆశ్రయించునట్టి; జనుల్ = వారల; కిన్ = కు; ఆనంద = సంతోషములు; సందోహము =సమాహారము; ఈన్ = ఇయ్యవలె నని; తలచి = భావించి; వివిధ = అనేక రకముల; హేల =లీలల; తోడన్ = తోటి; అప్రపంచకుండవు = ప్రపంచాతీతుడవు; అయ్యున్ = అయినప్పటికిని; ప్రపంచంబున్ = జగత్తును; వెలయజేయుదువు = అలర జేయుదువు; ఈవు = నీవు {విశ్వము - శ్రు. విశ్వశబ్దస్య ఓంకారోభిధీయతే, శ్లో. ఓమితి బ్రహ్మ ఓమితీదగం సర్వం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ (ఉపనిషత్) శ్రు. ఓం భూః ఓంభువః ఓంగంసువః ఓంమహః ఓంజనః ఓంతపః ఓంగం సత్యం}; విశ్వమూర్తి = శ్రీకృష్ణా {విశ్వమూర్తి - విశ్వ (జగత్తు, ఓంకార) మూర్తి (స్వరూపుడు), విష్ణుసహస్రనామాలు 717వ నామం}.

భావము:

విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తీ! నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి, నడుపుతూ ఉంటావు.