పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : క్రేపుల వెదక బోవుట

  •  
  •  
  •  

10.1-500-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం
నియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో
యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో?
ని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.”

టీకా:

వినుడు = వినండి; ఓ = ఓహోయ్; బాలకులారా = పిల్లలు; క్రేపులు = దూడలు; అటవీ = అడవి; వీధిన్ = మార్గమువ; మహా = చాలా; దూరమున్ = దూరముగా; చనియెన్ = వెళ్ళినవి; కోమల = లేత; ఘాస = గడ్డిని; ఖాదన = తినవలెననెడి; రతి = ఆసక్తితో; ఉత్సాహంబు = హుషారు; తోన్ = తో; ఎందున్ = ఎక్కడికి; పోయెనో = వెళ్ళినవో; ఏమి = ఏమిటి; అయ్యెనో = జరిగినదో; క్రూరజంతువుల = క్రూరజంతువుల {క్రూర జంతువులు - ఇతర జంతువులను చంపి తినెడి పులి మున్నగు జంతువులు}; చేన్ = వలన; ఏ = ఎట్టి; ఆపదన్ = ప్రమాదము, ఇక్కట్లను; పొందెనో = పొందినవో; కని = చూసి; తెత్తున్ = తీసుకొని వచ్చెదను; కుడువుండు = తినండి; చల్దిన్ = చద్దిభోజనములు; కొఱతలు = తక్కువపడుట; కాకుండన్ = జరుగకుండా; మీరు = మీరు; అందఱున్ = అందరు.

భావము:

“ఓ మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.” అని చెప్పి బయలుదేరాడు