పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సురలు పూలు గురియించుట

  •  
  •  
  •  

10.1-491-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో
దాస్వాద వినోద మోద మదభృం ద్వంద్వ ఝంకారమున్
కల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల
స్వవిస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.

టీకా:

కనియెన్ = కనుగొనెను; కృష్ణుడు = కృష్ణుడు; సాధు = మంచి; నీరమున్ = నీళ్ళు కలిగినదానిని; మహా = మిక్కిలి; గంభీరమున్ = లోతు గలదానిని; పద్మ = పద్మముల; కోకనద = ఎఱ్ఱకలువలను; ఆస్వాద = సుగంధాలను ఆస్వాదించుటను; వినోద = క్రీడగా, వేడుకగా; ఆమోద = తీసుకొనుటచే; మద = మత్తెక్కిన; భృంగ = తుమ్మెదల; ద్వంద్వ = జంట యొక్క; ఝంకారమున్ = ఝంకారములు కలదానిని; ఘన = గొప్ప; కల్లోల = పెద్ద అలలు అనెడి; లతా = తీగల; వితాన = సమూహము నందు; విహరత్ = విహరించుచున్న; కాదంబ = కలహంసల {కాదంబము - ధూమ్రవర్ణము కల ముక్కు కాళ్ళు కల హంస}; కోలాహల = కలకల మనెడి; స్వన = ధ్వనులచేత; విస్ఫారమున్ = అధికముగా కల దానిని; మంద = మెల్లని; వాయుజ = గాలివలన కలిగిన; కణ = నీటితుంపరలు; సారంబున్ = దట్టముగా కలదానిని; కాసారమున్ = సరస్సును.

భావము:

అలా అఘాసుర వధానంతరం వెళ్ళిన కృష్ణుడు ఒక కొలనును చూసాడు. అది ఎంతో లోతైనది, స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నది. పద్మాలు, ఎఱ్ఱకలువలు ఆ చెరువులో వికసించి ఉండగా వాటి సుగందాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు ఝుంకారం చేస్తూ ఆ పూవుల పైననే తిరుగుతున్నాయి. ఆ కొలనులో నీటిఅలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవుల పండువుగా వినవస్తోంది. చల్లని పిల్లగాలికి నీటితుంపరలు ఎగురుతూ కొలనునిండా వ్యాపించి ఉన్నాయి.