పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సురలు పూలు గురియించుట

  •  
  •  
  •  

10.1-486-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాద్యంబులు, నా మహాజయరవం, బా పాట, లా యాటలున్
దేజ్యేష్ఠుఁడు పద్మజుండు విని ప్రీతిన్ భూమి కేతెంచి "నే
డీ త్సార్భకులన్ భుజంగపతి హింసింపంగ నీ బాలకుం
డేవెంటన్ బ్రతికించె? మే", లనుచు నూహించెం గడుం నివ్వెఱన్.

టీకా:

ఆ = ఆ యొక్క; వాద్యంబులున్ = ధ్వనులను; ఆ = ఆ; మహా = గొప్ప; జయరావంబున్ = విజయధ్వానములను; ఆ = ఆ; పాటలు = పాటలను; ఆ = ఆ; ఆటలున్ = నాట్యములను; దేవ = దేవతలలో; జ్యేష్ఠు = పెద్దవాడు; పద్మజుండు = బ్రహ్మదేవుడు; విని = విని; ప్రీతిన్ = కోరి, సంతోషముతో; భూమి = భూలోకమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; నేడు = ఇప్పుడు; ఈ = ఈ; వత్స = దూడలను; అర్భకులన్ = బాలురను; భుజంగ = పాములలో; పతి = గొప్పది; హింసింపంగన్ = చంపుతుండగా; ఈ = ఈ; బాలకుండు = పిల్లవాడు; ఏవెంటన్ = ఏ విధముగా; బ్రతికించెన్ = కాపాడెను; మేలు = గొప్పవిషయమే; అనుచున్ = అనుకొనుచు; ఊహించెన్ = అనుకొనెను; నివ్వెఱన్ = పారవశ్యముతో.

భావము:

దేవతలు అందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయజయద్వానాలు, వాద్యాలు, పాటలు విని ఏదో లోకకల్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. “ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఇంత చిన్న కుఱ్ఱాడు వారిని ఎలా బ్రతికించ గలిగాడో ఆశ్చర్యంగా ఉందే! భలే.” అని నివ్వెరపోయాడు.