పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బకాసుర వధ

  •  
  •  
  •  

10.1-447-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజుఁడు మ్రింగినఁ గృష్ణునిఁ
లేక బలాది బాలప్రముఖు లచే
నులై వెఱఁ గందిరి చ
య్యనఁ బ్రాణములేని యింద్రియంబుల భంగిన్.

టీకా:

దనుజుడు = రాక్షసుడు; మ్రింగినన్ = మింగివేయగా; కృష్ణునిన్ = కృష్ణుడిని; కనలేక = చూడలేక; బల = బలరాముడు; ఆది = మున్నగు; బాలక = గొల్లపిల్లలలో; ముఖ్యులు = ప్రముఖులు; అచేతనులు = చేష్టలుడిగినవారు; ఐ = అయ్యి; వెఱగు = దిగ్భ్రమ; అందిరి = చెందిరి; చయ్యన = చటుక్కున; ప్రాణములు = ప్రాణములు; లేని = పోయిన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; భంగిన్ = వలె.

భావము:

అలా రాక్షసుడు మ్రింగిడంతో బలరాముడు మొదలైన గోపాలబాలకులు కృష్ణుడు కనిపించక, ప్రాణంలేని అవయవాలవలె అచేతనులై భయంతో కంపించిపోయారు.